Posts

Showing posts from December, 2025

Simply, ‘unputdownable’

Image
       NENU – BAHUVACHANAM (Telugu) Writer-Journalist Mulugu Rajeswara Rao   This is the story or biopic - as the author loves to call it - of a man who braved setback after setback in life, took them in his stride and moved on regardless.   Rajeswara Rao, basically a journalist, donned many hats during his eventful career. He dabbled with varying degrees of success in printing, publishing, advertising, marketing, software projects, venture funding etc. By dint of sheer merit and hard work, he rose to collaborate with such global companies as Microsoft, Satyam, Wells Fargo, PriceWaterhouseCoopers (PWC), the BBC, et cetera. Two top politicians of the day who later became Chief Ministers were his ‘clients’. He formulated a business strategy for one and political strategy for another. Remarkable achievement for a man without a Godfather and sound financial background. It was a snake and ladder affair for the author to whom destiny had been less t...

జీవిత కథలు ఇలా కూడా రాయవచ్చా…!!!

Image
  ఆత్మకథలు అన్నా , జీవితకథలు అన్నా..వాటిలో అబద్ధాలే ఎక్కువ ఉంటాయని , స్వోత్క ర్ష కు చోటు ఎక్కువ అని నాకు ఓ అపోహ ఉంది. పలువురి ఆత్మకథలు చదివినప్పుడు ఆ అనుమానం మరింత బలపడింది. కానీ , ములుగు రాజేశ్వరరావు రాసిన ‘‘నేను-బహువచనం’’ పుస్తకం   ఆ   అపోహ తప్పు అన్పించేలా చేసింది. నిజాలను , నిర్భయంగా  రాయడం , జీవితంలో ఎదురైన చేదు నిజాలు , ఆ సందర్భాలలో తన నిజాయితీని , నిర్బయంగా ఒప్పుకోవడం , తన భావోద్వేగాలను ఉన్నదున్నట్లు రాస్తూ , తన తప్పిదాలను అంగీకరించడం చూసిన తర్వాత ‘‘ఇలా కూడా జీవిత కథలు   రాయవచ్చా. రాసేవారు ఉంటారా’’.. అని అన్పించింది. సిసలైన జర్నలిస్టు గా బతకాలనే సంకల్పంతో , కష్టాలకు ఎదురీది రాజేశ్వర రావు చేసిన పోరాటమే ఈ పుస్తకం.     రాజేశ్వర రావుతో నా పరిచయం 50 ఏళ్లకు పైమాటే , ఆంధ్రజనతలో అతడు చేరే టప్పటికే , నేను అక్కడ ఆఫీస్   బాయ్ -కమ్- క్లర్క్- కమ్ ఫ్రూఫ్ రీడర్...   వంటి చిన్నపాటి ఉద్యోగం వెలగబెడుతున్నా. నవ్యాంధ్ర తర్వాత , పాండురంగా రావు గారి తో కలిసి ఆంధ్రజనతలో చేరిపోయా. అక్కడే రాజేశ్వరరావు , శ్రీకారం రామ్మోహన్ , రంగాచారి పరిచయం. ఆ తర్వాత నేను...

ఈ పుస్తకం ఒక మార్మిక ఆకర్షణ

Image
  2025   నా జీవితంలో ఒక ముఖ్యమైన సంవత్సరం...ఎన్నో అనుభవాలూ , పాఠాలూ - నా ప్రియ మిత్రుడు లక్ష్మీనారాయణ రహస్యమిత్ర ( secret   santa) గా మారి ఈ అద్భుతమైన పుస్తకం పంపించారు...పేరు తో సహా ఈ పుస్తకం ఒక మార్మిక ఆకర్షణ - మొదలు పెట్టాక మళ్ళీ కింద పెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టి పడేసిన అద్భుతం - దాని మీద నా చిన్న రివ్యూ –   ‘‘నేను- బహువచనం’’ “ నేను ” అన్న మాట సాధారణంగా ఏకవచనం. కానీ ‘నేను – బహువచనం’ చదువుతుంటే ఆ “ నేను ” అద్దంలా పగిలి... ప్రతి ముక్కలో మనమే కనిపిస్తాం. రచయిత చెప్పేది ఒక వ్యక్తి కథ కాదు ; మన లోపల రోజూ జరిగే గుంపు సమావేశం. తర్కం మాట్లాడుతుంది , భయం వాదిస్తుంది , ఆశ మైక్ లాక్కుంటుంది.... అన్నిటికీ అధ్యక్షుడు ఎవరో తెలియదు. ఇది ఆ గందరగోళానికి ఇచ్చిన సాహిత్య మినిట్స్.   ఇక్కడ తత్త్వం ఉపన్యాసంలా కాదు ; అది చాయ్ షాపు సంభాషణలా వస్తుంది. అస్తిత్వం గురించి ప్రశ్న వేస్తూ , “ ఇంత డీప్‌గా ఆలోచిస్తే కాఫీ చల్లబడుతుంది ” అని కన్నుగీటు. మనం ఒకే వ్యక్తిగా నటిస్తున్న బహుళ వ్యక్తిత్వాలమనే నిజం... ఇక్కడ హాస్యంతో బయటపడుతుంది. ‘నేను’ అనేది స్టేబుల్ ఫైల్ కాదు ; ప్రతి...

ఈ ఆత్మకథ...మన కోసం...

Image
        ములుగు రాజేశ్వర రావు గారితో నా పరిచయం దాదాపు పాతికేళ్లది . అయితే , అది చాలా కాలం ముఖ పరిచయం మాత్రమే . మొదట ఆర్ . ఈశ్వర రెడ్డి ( అప్పుడు జాయింట్  కమీషనర్ ఆఫ్  పో లీస్ ) గారి ఆఫీసులో . ఈశ్వర రెడ్డి గారు ‘ సిటీ పోలీస్ న్యూ స్ ’ అనే పత్రికను తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు . ఆ విషయంలో ఆయనకు తోడ్పడుతుండే వాడిని . పత్రిక గెటప్ , పేజినేషన్ వంటి సాంకేతిక విషయాలలో సహాయం చేయడానికి రాజేశ్వర రావు గారు వచ్చారు . మాటల సందర్భంలో ఆయన జర్నలిస్టు అని తెలిసికోవడం తప్ప ఆయన గురించిన ఇతర వివరాలేవీ నాకు తెలియవు .  కాని కలిసి పనిచేశాం . జర్నలిస్టుగా ఆయన అనుభవం పత్రికను అద్భుతంగా తీసికొని రావడానికి ఉపయోగపడింది . అప్పటి వరకు జర్నలిజంలో నాకున్న పరిచయం వార్తలు రాసే పద్ధతులు , వాడే భాషకు సంబంధించి మాత్రమే . జర్నలిస్టులలో సన్నిహిత మిత్రులున్నారు . కాని నాకు జర్నలిజం లోతుల్లోకి వెళ్లే అవకాశమూ తక్కువే , ఆసక్తీ తక్కువే . సాంకేతికాంశాల గురించిన పరిజ్ఞానం మరీ తక్కువ . అందువల్ల ఆ సమయంలోరాజేశ్వర రావు గారి పనిలో ని విశిష్టతను గుర్తించే అవకాశం లభించలేదు . నేను గమనించింది ఆయన లోని స...

ఈ పుస్తకం ఎందుకు చదవాలి?

Image
  ‘‘నేను-బహువచనం’’ ఈ పుస్తకం చదవకముందు నాకు తెలిసిన రాజేశ్వర రావు ఒకరు ! చదివిన తరువాత నాకు అర్థమయిన ' నేను ' ...  రాజేశ్వర రావు వేరొకరు ! మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన పాత్రికేయులు ఈ వృత్తిలో నిలదొక్కుకోవటం ఎంతో కష్టమైన విషయం. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ వృత్తిలో స్థిరపడటానికి ఆసక్తి , ఆ శక్తి ఉన్నా అవకాశాలు కూడా రావాలి కదా! అలాంటి సందిగ్ధ స్థితిలో ఖాళీగా కూర్చొనేందుకు ఆర్థిక   అవసరాలు అనుమతించవు. రకరకాల ఉపాధి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన వాటిని వదులుకోలేని అశక్తత , ఏదో రకంగా కొంత ఆదాయం ఉంటుంది కదా అనుకొని అంగీకరిస్తే బట్టల దుకాణంలో ఉద్యోగం , వ్యాపార ప్రకటనల సంస్థను స్వంతంగా నడిపే సాహసం , ప్రింటింగ్ ప్రెస్ పెడదాం రమ్మని పిలిచే స్నేహం ...   ఇలాంటి ఆకర్షణలు ఎలా వెంటాడతాయో , ప్రతిదీ దేనికదే ' ఈ రంగంలో నేను రాణిస్తాను ' అన్న విశ్వాసాన్నిచ్చే ' ప్రతిభ గుర్తింపు ' సోపానాలు మనసుని గుంజేస్తూ మధ్యలో మాయమవుతాయో , మన ప్రతిభకి ప్రకాశాన్ని తెచ్చే దారిలో నడిపిస్తున్నట్లే ఉండి మన శ్రమని , తెలివిని సొమ్ము చేసుకునే శక్తులు మనతోనే ఉంటూ మనకి జ్ఞానోదయం కాకుండా ఎలా వెన్...