అతడనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు...



సీనియర్ పాత్రికేయులు ములుగు రాజేశ్వరరావు గారు రాసిన ‘‘నేను-బహువచనం’’...   ఆత్మకథగా సాగిన వారి పాత్రికేయ జీవిత ప్రస్థానం. వారి తరంలో  కొన్ని విలువలకు కట్టుబడి జర్నలిజాన్ని ఆరాధించి బ్రతికిన చాలామంది జర్నలిస్టుల జీవితాలకు ఇది అద్దం పడుతుంది. అయినప్పటికీ రాజేశ్వరరావు గారి వంటి సాత్వికతఆత్మాభిమానం, తను నమ్మిన జీవిత విధానం పట్ల మొక్కవోని అభిమానం ఉన్నవారు నూటికి ఒకరు ఉంటారేమో. 

రాజేశ్వరరావు గారు     వయసులోనూ    పాత్రికేయ అనుభవంలోను నాకంటే పెద్దవారు. ఆంధ్రజనతలో వారు పనిచేసినప్పుడు  మూడు నెలలు అక్కడ కొత్తగా చేరిన ట్రైనీ సబ్ ఎడిటర్లలో నేను ఉన్నాను. మార్పు గోపీనాథ్, జి. శ్రీరామమూర్తిగార్లు నన్ను ‘ఆంధ్ర జనతకు’ పరిచయం చేశారు వారు ప్రస్తావించిన శ్రీకారం రాంమోహన్ గారు,  నరసింహారావు గారు, రాధాకృష్ణ గారు,  రాంప్రసాద్ గారు,  సుబ్బారావు , రంగాచారి నాకు బాగా తెలుసు. తరువాత నేను ప్రజాతంత్ర,  ఆంధ్రప్రభల్లో చేరి బెంగళూరులో, చెన్నై లో పనిచేయటం జరిగింది. రంగాచారి నా తరువాత బెంగళూరులో చేరగా, 1986 నుంచి 1987 వరకు విజయనగరంలో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేసినప్పుడు సుబ్బారావు నా సహోద్యోగి. నేను పనిచేసినప్పుడు ఆంధ్రజనతలో ఎడిటర్ పాండురంగారావు గారిని ఎప్పుడూ చూడలేదు.కానీ చెన్నైలో ఆంధ్రా క్లబ్ లో కాకతాళీయంగా కలవటం జరిగింది.అప్పటికే ఆయన బాగా వృద్ధులయిపోయారు.

‘ఈనాడు’లో రాజేశ్వర రావు గారు ఎదుర్కొన్న అనుభవాలు,  ఆంధ్రప్రభలో చేరటానికి ఆయన పడ్డ తాపత్రయం ఆనాడు పరిమితంగా ఉండే మీడియాను వాటిలో ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ను సూచిస్తుంది. నేను కూడా ‘ఈనాడు’ ఇంటర్వ్యూ కు వెళ్ళి...  ఫలితాలు తెలిసే లోగా సమ్మె జరగటం...  ఈలోగా ఆంధ్రప్రభ ఇంటర్వ్యూ కు వెళ్ళి వెంటనే సెలెక్ట్  కావటం...   నేను చేరిన తరువాత ఈనాడు appointment ఆర్డర్ రావటం...  నేను ప్రభలోనే కొనసాగటం జరిగిపోయాయి.

కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి ఎన్నో అవకాశాలను, వ్యక్తిగత సుఖాలను వదులుకున్న  విశిష్ఠ వ్యక్తిగా ఆయన జీవితం, నడవడిక ఆదర్శప్రాయం. గాంధీగారు My Experiment With Truth లో నిర్భయంగా తనను తాను ఆవిష్కరించుకున్న నిజాయితీ...  రాజేశ్వరరావు గారి ఈ రచనలో కనిపిస్తుంది.  రచయితలుగా సాహితీ వాసనలు ఉన్న జర్నలిస్టులందరూ పాత్రికేయ వృత్తిలో ఆత్మతృప్తి పొందటానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.ఆ తరానికి చెందిన రాజేశ్వరరావు గారు రాసిన ఈ పుస్తకంలో పాత్రికేయ ప్రపంచ పరిణామ క్రమాన్ని ,  పాత్రికేయ వృత్తి విలువలను, సాధక బాధకాలను తెలియజెప్పారు. విలువలపరంగా మారిన నేటి పాత్రికేయ ప్రపంచంలో...  మీడియా వ్యవస్థలో ఈ రచయిత లాంటి ... బ్రతకటం చేత కాని జర్నలిస్టులు ఉంటారా  అనిపిస్తుంది.  

కానీ ప్రతి జర్నలిస్టు ... చదవదగిన అంశాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అయితే ఈ పుస్తకాన్ని వారితో తప్పక  చదివించాలనే ఉద్దేశంతోనే...  ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావించలేదు. ఈ పుస్తకం ఆవిష్కరణ సభకు నన్ను కూడా ఆహ్వానించిన రాజేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .

-        ఎస్ వి సూర్యప్రకాశరావు

(సూర్యప్రకాశ్ రావుగారు ఆంధ్రప్రభలో  హైద్రాబాద్, బెంగళూరు, విజయనగరం, చెన్నైలలో వివిధ హోదాలలో11 ఏళ్లు  పనిచేశారు. చెన్నైలో  తెలుగు ‘‘ఇండియాటుడే’’ సంపాదకవర్గంలో ప్రారంభం నుంచి చివరివరకు ఉన్నారు. చెన్నైలోని తెలుగువారి సాహితీ, కళా, సామాజిక సేవా సంస్థలలో చాలా కీలక సభ్యుడిగా ఉన్నారు. రిటైర్మెంట్  వయసు దాటి చాలా కాలం అయినా ఇప్పటికీ కొన్ని పత్రికలకు కన్సల్టింగ్ ఎడిటర్‌గా, కొన్ని ప్రజోపయోగకరమైన సోషల్ మీడియా గ్రూపులకు అడ్మిన్ గా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం India Next గ్రూవ్ ఛానెల్స్ CEO గా  పనిచేస్తున్నారు.)



(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే...   అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........

(మీ అభిప్రాయాలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో ...Enter Comment... అని ఉన్న చోట... పెడితే అందరూ చూస్తారు... ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)


Comments

  1. మీరు చెప్పినట్లు, "ప్రతి జర్నలిస్టు చదవదగిన అంశాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి కానీ..." అనే విషయంలో కొన్ని ముఖ్యమైన కోణాలు ఉన్నాయి. ములుగు రాజేశ్వరరావు గారు దశాబ్దాల కాలం పాటు జర్నలిజంలో ఉండి, ఎన్నో పరిణామాలను దగ్గరగా చూసిన వ్యక్తి.

    ఆయన పుస్తకంలో జర్నలిస్టులకు ఉపయోగపడే విషయాలు ఇవే కావచ్చు:

    1. ఆదర్శం వర్సెస్ నేటి వాస్తవం

    రాజేశ్వరరావు గారి కాలంలో జర్నలిజం ఒక మిషన్ (ధర్మం) లా ఉండేది. కానీ నేడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఆయన చెప్పిన విలువలను నేటి "బ్రేకింగ్ న్యూస్" సంస్కృతిలో అమలు చేయడం జర్నలిస్టులకు ఒక సవాలుగా అనిపించవచ్చు.

    2. రాజకీయాలతో సంబంధాలు

    ఆయన కాలంలో రాజకీయ నాయకులతో జర్నలిస్టులకు సన్నిహిత సంబంధాలు ఉండేవి, కానీ అవి వార్తలలో నిష్పాక్షికతను దెబ్బతీసేవి కావు. అయితే, నేటి కాలంలో రాజకీయ పక్షపాతం (Bias) పెరిగిపోయిన నేపథ్యంలో, ఆయన చెప్పిన ఆ పాత పద్ధతులు ఇప్పటికీ సాధ్యమేనా? అనే సందేహం కలగవచ్చు.

    3. క్షేత్రస్థాయి అనుభవాలు

    ఆయన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను, ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలు స్ఫూర్తినిస్తాయి, కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో (Social Media age) జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేగం, ట్రోలింగ్ మరియు టెక్నాలజీ సవాళ్లు ఆ పుస్తకంలో ఉండవు.

    ఈ పుస్తకంలోని ప్రత్యేకతలు:

    * నిజాయితీ: తన కెరీర్‌లో జరిగిన తప్పులను లేదా ఒడిదుడుకులను కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పి ఉండవచ్చు.

    * భాషా పటిమ: ఒక జర్నలిస్టుకి ఉండాల్సిన స్పష్టమైన భాషా శైలి ఇందులో కనిపిస్తుంది.

    * సాక్ష్యం: తెలుగు పత్రికల పనితీరును ఒక జర్నలిస్టు కళ్ళతో చూడాలనుకునే వారికి ఇది ఒక నిధి లాంటిది.

    - ప్రొ.శివదేవుని శ్రీగిరీశం, వరంగల్

    ReplyDelete
  2. విశ్లేషణ బాగుంది

    ReplyDelete

Post a Comment