Posts

Showing posts from February, 2026

...కన్నులు చెలమలయ్యాయి

Image
‘‘నేను ప్రస్తుతాన్ని – గతానికి శిఖరాన్ని’’   ‘‘నేను అక్షరాన్ని – నేను సాగేదాన్ని’’ ‘‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’’   ములుగు రాజేశ్వర రావుగారి ‘‘నేను- బహువచనం’ ’ పుస్తకం చదువుతున్నంతసేపు...  పైన తెలిపిన ప్రముఖ కవుల మాటలే స్ఫురించాయి. స్వీయ చరిత్ర రాయాలంటే ఎంతో దమ్ము, ధైర్యం కావాలి. అవి ప్రదర్శిస్తూనే వారి బలాలు, బలహీనతలు తెలియచేసారు.   పుస్తకం చూడగానే ‘నేను-బహువచనం’’ కవర్ పేజీ మీద జర్నలిజం, రియలిజం అన్న అక్షరాలు,  రెండు మెట్లు ఎక్కడం, నాలుగు మెట్లు దిగడాన్ని సూచించే  వైకుంఠపాళి బొమ్మను ముద్రించారు. . ఇవి ఆకర్షణీయంగా ఉండి పుస్తకాన్ని చదవాలనిపించేలా ఉన్నాయి.    పుస్తకం ఆరంభంలో పేర్కొన్న..  ‘‘సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ బాగుంటాయి... కానీ గమనిస్తే ఈ రెండింటి మధ్య నా ప్రయాణం ఇంకా బాగుంటుంది’’ అన్న ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ వ్యాఖ్య....  ...తక్కువ మాటలతో ఎక్కువ విషయాన్ని చెబుతూనే చదవబోయే కథనంపై కుతూహలాన్ని రేకెత్తించింది. ఉద్యోగ ప్రయత్నం చేయడం, కుటుంబంలో పెద్దకుమారుడిగా బాధ్యతలు మోయడం... మిలిటరీ ఉద్యోగ సన్నాహాల సన...