పుస్తకమే అలా లాక్కుపోయింది
‘నేను – బహువచనం’ పుస్తకం పూర్తిగా
చదివాను. చాలా శ్రద్ధగా చదివాను. చదివాను అనడం కంటే మొదలు పెట్టిన తర్వాత పుస్తకమే
నన్ను లాక్కుపోయింది అని చెప్పవచ్చు. మీతో నాకు దీర్ఘకాల పరిచయం ఉన్నా, మీ
అసలైన వ్యక్తిత్వం ఎంత ఉత్కృష్టమైందో ఈ పుస్తకం చదివినంతవరకు నాకు అనుభవం లోకి
రాలేదు.
స్టేట్ బ్యాంక్ యూనియన్ ఆఫీసులో ‘విజిలెన్ట్’
పత్రిక గురించి అప్పుడప్పుడు మీతో సంప్రదింపులు జరిపినా మీరు ఎంత నిబద్ధత కలిగిన
పాత్రికేయులో అప్పుడు నేను గుర్తించలేక పోయాను. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న
కష్టాలు సవాళ్లు గురించి చదువుతున్నప్పుడు హృదయం ద్రవించిపోయింది.
తాను నమ్మిన నైతిక విలువలను ఆచరణలో పెట్టడం
కోసం ఎన్ని విధాలైన సవాళ్లనైనా ఎదుర్కొని నిలవడం మీలాంటి దృఢ చిత్తం, అచంచల
వ్యక్తిత్వం ఉన్నవాళ్ళకు మాత్రమే సాధ్యం . మీరు రచించిన ఈ గ్రంథం యువ
పాత్రికేయులకు స్ఫూర్తిదాయకంగా
నిలుస్తుందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అభివందనాలతో,
మీ
అశోక్
(మృదు స్వభావి,
నిరాడంబరుడు, స్నేహశీలి, స్వతహాగా మంచి రచయిత, అభ్యుదయవాది అయిన అశోక్ - ప్రముఖ
కవి, సంపాదకుడు గజ్జెల మల్లారెడ్డిగారి కుమారుడు.)
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతుంది.
గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా అయితే... అసలు ధరకే లభిస్తుంది.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.........


Comments
Post a Comment