కష్టాల కడలి అంటే ఇలా ఉంటుందా !!!

 


 

అసలు కష్టాల కడలి అనేది ఉంటుందా ?  ఏమో ఉంటుందే మో !!! ‘నేను-బహువచనం’  పుస్తకం చదివాక ఉంటుందనే నిర్ధారణకు వచ్చా. కష్టాల వెనుక కష్టాలు తుఫానులా తరుముకు వస్తుంటే, ఆర్థిక పరిస్థితిపై దెబ్బమీద దెబ్బ పడుతూ ఉంటే, వాటన్నింటినీ ఎదుర్కొని రచయిత కష్టాల కడలిలో తామర పువ్వుపై చేరాడనిపించింది.

 

నిజానికి ములుగు రాజేశ్వర రావు రాసుకున్న ఆత్మకథలో ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన అమ్మగారే ! డిగ్రీ కోర్సు చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ సంభాషణను పరోక్షంగా  వినకపోయి ఉంటే... ఆయన జీవితం మరో మార్గంలో సాగేదేమో ....!!!

 

ఛెల్లారామ్స్ తో మొదటి ఉద్యోగం ప్రారంభించి, ఆంధ్రజనత, ఈనాడు, ఆంధ్రపత్రిక, వార్త...ఆ తరువాత స్వంత సంస్థలు, ప్రయోగాలతో సుడిగుండాలను దాటి రాటుదేలిన మహామనీషి.... రాజేశ్వర రావు అనిపించింది.

 

ఈ పుస్తకం చదువుతూ ఉంటే, రచనా శైలి... సెలయేరులో పడవ ప్రయాణం సాగుతున్నంత హాయిగా అనిపించింది. రచయిత మన ఎదురుగా కూర్చుని మనతో ముచ్చటిస్తున్నంత సౌకర్యవంతంగా ఉంది. వాడుక భాష, పుస్తక భాష కలిసిపోయాయి.

 

మధ్య తరగతి జీవితాలను, మరీ ముఖ్యంగా జర్నలిస్టుల జీవితాల్లోని లోతుపాతులను,  స్వతంత్రంగా, సాహసాలు చేస్తూ  బతికేవారి కష్టనష్టాలను వాస్తవిక సన్నివేశాలతో రచయిత ఒక నవల లాగా చెప్పిన తీరు అది కూడా ఎక్కడికక్కడ ఉత్కంఠ భరితంగా ఉంటూ ఆకట్టుకున్నది.

-      - ఎ. విశ్వేశ్వర రెడ్డి, సీనియర్ జర్నలిస్టు


(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే...   అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........

Comments

Popular posts from this blog

ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

...కన్నులు చెలమలయ్యాయి

అధినాయక జయహే... కవితా సంకలనం... సమీక్ష

అతడొక సముద్రం!

It reminded me of my life...

మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......

పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!

తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?