Posts

It reminded me of my life...

Image
NENU- BAHUVACHANAM, book gives voice to experiences of a principled person ----- mostly the eldest son of a family, responsible for running it, belonging to lower middle class, in our society at large; Buoyed up by dreams, but weighed down by responsibilities, at times rebellious at the dictates of unjust social ethos around, and always struggling to keep afloat and finally reaching the shore battered and tired --- ….couched in absorbing narrative style and inimitable diction… Some narrated incidents reminded me of my student life at VR College and some similar career experiences in life later.   God bless you Tammudu !!      -Mulugu Hanumantha Rao   (Shri Mulugu Hanumantha Rao  is   a distinguished community leader and a philanthropist. He has dedicated himself to the spiritual and social rejuvenation of the Sroutha Saiva Araadhya Brahmin Community in Hyderabad. Following an illustrious professional career at the Food Corporation of India (F...

‘నేను’ కావాలా !!!

Image
కవితా సంకలనం ....... యాభై ఏళ్ళ వృత్తిగత జీవితం(ప్రధానంగా జర్నలిజం) నేపథ్యంలో  నవలలా సాగిన వాస్తవిక ఆత్మకథ... ....... నేను-బహువచనం 220 పేజీలు /Wt.210 gms  =   రు.180   అధినాయక జయహే.. కవితా సంకలనం 160 పేజీలు /Wt.115gms  =రు.120 ఈ పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద   దొరుకుతాయి. గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా విడివిడిగా .. ఈ పుస్తకాలు అసలు ధరకే లభిస్తాయి. యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా   9866312323   నంబరుకు పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ   స్పష్టంగా వారి పేరు ,    పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు   తెలియచేయాలి. రెండూ కలిపి అయితే...పార్సిల్  లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా  చార్జీలు అదనం.  బరువు, దూరాన్ని బట్టి చార్జీలు మారతాయి. ( పూర్తి భరోసాతో,  త్వరగా  అందుతాయి) ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో   TeluguBooks.in   Amazon.in Sahithi Prachuranalu   logili.com     ....వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది. ...

అతడనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు...

Image
సీనియర్ పాత్రికేయులు ములుగు రాజేశ్వరరావు గారు రాసిన  ‘‘నేను-బహువచనం’’ ...    ఆత్మకథగా సాగిన వారి పాత్రికేయ జీవిత ప్రస్థానం. వారి తరంలో  కొన్ని విలువలకు కట్టుబడి జర్నలిజాన్ని ఆరాధించి బ్రతికిన చాలామంది జర్నలిస్టుల జీవితాలకు ఇది అద్దం పడుతుంది. అయినప్పటికీ రాజేశ్వరరావు గారి వంటి సాత్వికత ,  ఆత్మాభిమానం , తను నమ్మిన జీవిత విధానం పట్ల మొక్కవోని అభిమానం ఉన్నవారు నూటికి ఒకరు ఉంటారేమో.  రాజేశ్వరరావు గారు      వయసులోనూ     పాత్రికేయ అనుభవంలోను నాకంటే పెద్దవారు. ఆంధ్రజనతలో వారు పనిచేసినప్పుడు  మూడు నెలలు అక్కడ కొత్తగా చేరిన ట్రైనీ సబ్ ఎడిటర్లలో నేను ఉన్నాను. మార్పు గోపీనాథ్, జి. శ్రీరామమూర్తిగార్లు నన్ను ‘ఆంధ్ర జనతకు’ పరిచయం చేశారు వారు ప్రస్తావించిన శ్రీకారం రాంమోహన్ గారు ,   నరసింహారావు గారు , రాధాకృష్ణ గారు ,   రాంప్రసాద్ గారు ,   సుబ్బారావు , రంగాచారి నాకు బాగా తెలుసు. తరువాత నేను ప్రజాతంత్ర ,   ఆంధ్రప్రభల్లో చేరి బెంగళూరులో, చెన్నై లో పనిచేయటం జరిగింది. రంగాచారి నా తరువాత బెంగళూరులో చేరగా , 1986...

అతడొక సముద్రం!

Image
బీచ్ కి వెళ్లిన ప్రతి ఒక్కడూ "నేను సముద్రాన్ని చూశా" అంటాడు.   ఎవరైనా   " నాకు సముద్రం కనిపించింది" అనడం విన్నామా ?   లేదు కదూ ? సముద్రాన్ని మనం చూస్తాం. అయితే మనకి    సర్వంకషంగా ఆ సముద్రం కనపడదు. దూకుతూ వచ్చిన కెరటాలు ఒడ్డున విరిగి ,   విరిసి పోతూంటాయి. ఎక్కడో కొన్ని ఫర్లాంగుల అవతల ప్రశాంత గంభీరంగానూ వుంటుంది అదే సముద్రం.   ఒక్కొక్కసారి అక్కడ కూడా హృదయదఘ్నకల్లోలం అతలకుతలం చేసేస్తుంది.   అయినా ఆ హడావిడి మలగిపోగానే మళ్లీ ప్రశాంతతను నిలబెట్టుకుంటుంది.   ములుగు రాజేశ్వరరావు అనే అస్తిత్వం సరిగ్గా ఆ సముద్రసదృశం! అవును...అతడొక సముద్రం! "నేను-బహువచనం" అనే గ్రంథం... దానిని నేను కేవలం పుస్తకం అనను... "గ్రంథం"అనే అంటాను. అది ఆయన జీవన కథనం. దానిని చదివి , దాని గురించి మాట్లాడుతున్న , వ్రాస్తున్న వారు అందరూ ఒకటే మాట అంటారు , అంటున్నారు.   "మేము రాజేశ్వరరావుతో ఇన్నేళ్లు కలిసి పని చేశాం. ఆయన మాకు బాగా తెలుసునని అనుకున్నాం కానీ ఈ పుస్తకం చదివిన తరువాత క్రొత్తగా కనిపిస్తున్నారు. ఆయన గురించి మాకేమీ తెలియదని ఇప్పుడే తెలిసింది" అని నిర్ఘా...

ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

Image
  ‘ నేను – బహువచనం ’ ఆసక్తికరంగా చదివించే లక్షణం పుష్కలంగా కలిగిన పుస్తకం.  ఇది ఒక జర్నలిస్టు జీవిత చరిత్ర అనడం కన్నా ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి అనడం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. జర్నలిస్టుగా ప్రారంభించిన జీవితం కొన్ని మజిలీలలోనే కాస్తంత నిలకడగా సాగుతుంది. ‘ ఈనాడు ’ లో పని చేసిన కాలం చెప్పుకోదగినది. ఈనాడులో ప్రవేశించే ముందు అప్పటి ‘ ఆంధ్రప్రభ ’ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావుతో మాట్లాడిన లేదా మాట్లాడని తీరు ములుగు రాజేశ్వరరావు వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అహంకారం కాదు. ఆత్మగౌరవం , ఆత్మవిశ్వాసం కలగలిపిన దురుసుతనం మొదటి నుంచి ఇప్పటి దాకా ఆయనలో కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం. సబ్-ఎడిటర్ గా ఉంటూనే పేజీలు పెట్టించడం , ఎడిషన్ల పని చూసుకోవడం వంటి పెద్ద బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనది. ఆంధ్రపత్రికలో చేసిన విన్యాసాలు , పత్రికాప్రపంచంలో పోయిన పోకడలూ ఆయనను ఒకానొక అరుదైన జర్నలిస్టుగా నిలబెడతాయి. జర్నలిజం వీడిన అనంతరం చేసిన అనేకానేక ప్రయోగాలూ , వెబ్ సైట్లూ , డిజిటల్ మీడియాలో ఎత్తుగడలూ ,   ఆయనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలూ   అసాధారణమైనవి. అన్ని వైవిధ్యభరితమైన రంగాలలో ప...